భారతదేశం, సెప్టెంబర్ 10 -- తమ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ ప్రజలను కాంగ్రెస్ బెదిరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు కేటీఆర్. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉపఎన్నికలో పంచి గెలవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని రేవంత్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మాట్లాడారు.

'ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమ అసమర్థతను అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఇటీవల గణేష్ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు...