భారతదేశం, మే 29 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జూన్ నెలలో జరగబోయే గ్రహాలు, నక్షత్ర రాశుల మార్పులు అనేక రాశిచక్రాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా నవగ్రహాలలో ఆకర్షణీయమైన గ్రహంగా భావించే శుక్రుడు మరికొద్ది రోజుల్లో తన రాశిని మార్చుకోబోతున్నాడు.

జూన్ 8వ తేదీ సాయంత్రం 5.43 గంటలకు శుక్ర గ్రహం చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ఈ సంచారం కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపినప్పటికీ, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం.. శుక్రుడిని ప్రేమ, సంపద, శృంగారం, ఆకర్షణ, విలాసవంతమైన జీవితానికి కారకుడిగా పరిగణిస్తారు. ఒకరి జాతకంలో శుక...