భారతదేశం, మే 14 -- జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీపై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జూన్ 8 మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వందల సంవత్సరాలుగా మృగశిర రోజు చేప ప్రసాదం పంపిణీ.. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేస్తుందన్నారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్...