భారతదేశం, జూన్ 8 -- పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు చెప్పచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక వ్యక్తి పుట్టిన నెల స్వభావం, ఆలోచన విధానం, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏడాదిలో ఉండే 12 నెలల్లో ఒక్కో నెలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది.

అయితే జూన్, జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఇతరులతో పోల్చుకుంటే ఈ నెలలో పుట్టిన వాళ్లు ఎలా విభిన్నంగా ఉంటారు? నిజానికి ఇతరులతో పోల్చుకుంటే ఎంతో భిన్నమైన మనస్తత్వంతో ఈ నెలలో పుట్టిన వాళ్లు ఉంటారు. అలాగే సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఇక ఈ నెలలో పుట్టిన వారి గుణగణాలు, కెరీర్, ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా చూసేద్దాం.

జూన్ నెలలో పుట్టిన వారు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరి నవ్వు...