భారతదేశం, జూలై 22 -- రెండు గ్రహాలు 90 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన యోగం వృత్తిలో మంచి పురోగతిని, ఆదాయంలో పెరుగుదలను, జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. అదే విధంగా జులై 29న కుజ, శుక్ర గ్రహాల మధ్య కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావం మేషం నుండి మీనం రాశి వారి జీవితాలపై కూడా కనిపిస్తుంది. ఉమ్మడి వ్యాపారం చేసేవారికి, పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్దతు ఉన్నవారికి ఈ యోగం మంచి లాభాలను తెస్తుంది. అంతే కాకుండా కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా లభించవచ్చు. ఇప్పుడు కుజ, శుక్ర గ్రహాల వల్ల ఏర్పడిన కేంద్ర యోగం వలన ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.

కుజ, శుక్ర గ్రహాల వల్ల ఏర్పడిన కేంద్ర యోగం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి విజయం లభిస్తుం...