భారతదేశం, జూన్ 25 -- జులై 1 నుంచి రైలు ప్రయాణం కొంచెం ఖరీదైనది కానుందని తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో ఛార్జీలను పెంచబోతోంది. ఏసీ, స్లీపర్, సెకండ్ (జనరల్) తరగతులకు ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని సమాచారం. అయితే లోకల్ రైళ్లు, నెలవారీ సీజన్ టికెట్ హోల్డర్లకు ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. 2025 జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఏసీ క్లాస్ కు కిలోమీటరుకు 2 పైసలు, స్లీపర్ క్లాస్ కు కిలోమీటర్ కు 1 పైసలు, జనరల్ క్లాస్ కు కిలోమీటరుకు 0.5 పైసలు (500 కిలోమీటర్లు దాటితే) ఛార్జీలు ఉంటాయి. దీనివల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.920 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రయాణికుల సంఖ్య ...