భారతదేశం, జూన్ 30 -- భారతీయ రైల్వే జులై 1 నుండి కొన్ని రైళ్ల ఛార్జీలను పెంచింది. కొత్త ఛార్జీలు, టికెట్ బుకింగ్‌లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఆధార్ తప్పనిసరి చేసింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని అన్ని జోన్‌ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అర్ధరాత్రి అంటే జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

జులై నుండి నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల ధరలు కిలోమీటరుకు 1 పైసా పెరిగాయి. ఏసీ-క్లాస్ ప్రయాణికులకు టికెట్ ధరలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయని నోటిఫికేషన్ పేర్కొంది. అయితే కొత్త ఛార్జీలు సబర్బన్ టిక్కెట్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.

సెకండ్ క్లాస్ ఆర్డీనరికి 500 కి.మీ. దాటితే అంటే 501 కి.మీ నుండి 1,500 కి.మీ దూరానికి టికెట్ ధర రూ.5, 1,501 కి.మీ నుండి 2,500 కి.మీ దూరానికి రూ.10 పెరుగుతుంది. 2,501 నుం...