భారతదేశం, జూన్ 30 -- విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య, ఆన్‌లైన్ విద్యా కేంద్రం (CDOE) ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సర్వం సిద్ధం చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గానూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జూలై 1వ తేదీన విడుదల చేయనున్నట్లు వర్సిటీ ప్రకటించింది.

ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ సీడీఓఈ డైరెక్టర్ డాక్టర్ డి.అప్పలనాయుడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విశ్వవిద్యాలయం అందిస్తున్న పలు రకాల సంప్రదాయ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు చేస్తూ, క్రమబద్ధమైన కళాశాలలకు వెళ్లలేని వారికి, గృహిణులకు, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే గ్రామీణ విద్యార్థులకు ఏయూ దూరవిద...