భారతదేశం, జూలై 2 -- శని గ్రహం 2026 జులై 27న మీన రాశిలో తిరోగమనం ప్రారంభిస్తుంది. ఈ కాలంలో శని చాలా శక్తివంతంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను కూడా అందిస్తుంది. ప్రతి వ్యక్తి కర్మకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే శని ఈ సంచారం చాలా ముఖ్యమైనది. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం, దాని ప్రతి కదలిక మానవ జీవితంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా శని వక్రగతిలో ఉన్నప్పుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని, కష్టాలు వస్తాయని ప్రజలు నమ్ముతారు. కానీ అయితే ఈసారి శని వక్రగతి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది ముఖ్యంగా నాలుగు రాశుల కింద జన్మించిన వారికి అదృష్టానికి ద్వారాలు తెరుస్తుంది.

శని తిరోగమనం వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితిని వేగంగా బలపరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, జీతం పెంపునకు అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు మం...