భారతదేశం, నవంబర్ 3 -- బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9లో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఎలిమినేట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారని తెలిసిందే. అలానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి దివ్వెల మాధురి హాజరు అయింది.

"మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మాధురినా మాధవినా" అని శివాజీ అడిగాడు. "నా పేరు మాధురి మాధవి కాదు" అని ఆమె బదులిచ్చింది. "ఇదే ఆరోజు చెబితే అంత గొడవ ఉండేది కాదుగా ఆ అమ్మాయితో" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. "అందరికి అలా చెప్పను. నాకు నచ్చితే చెబుతాను" అని శివాజీకే రివర్స్ పంచ్ ఇచ్చింది దివ్వెల మాధురి.

"హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగు ఇళ్లలోకి రావాలనుకున్నారు" అని శివాజీ అంటే "వెళ్లాను" అని మాధురి అంది. "వెళ్తే ఇంత త్వరగా ఎందుకు వస్తారు" అని శివాజీ అంటే.. "నేను రావ...