భారతదేశం, జనవరి 21 -- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , అడిషనల్ కమిషనర్లు , జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీలో అభివృధి కార్యక్రమాలు, పెండింగ్ వర్క్స్, శానిటేషన్, హెచ్‌ సిటీ, ఎస్‌ఆర్డీపీ ప్రాజెక్ట్‌లో పలు దశల్లో ఉన్న పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రణాళికల్లో భాగంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించారు. వారి కార్యచరణపై మంత్రి పొన్నం మాట్లాడారు.

ఆ తర్వాత జీహెచ్ఎ...