భారతదేశం, సెప్టెంబర్ 21 -- ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడారు. దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్‌టీ యావత్తు దేశం కోసం ఒక ఏకరూప వ్యవస్థను సృష్టించిందన్నారు. వన్ నేషన్ వన్ టాక్స్ కల నెరవేరిందని, సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. కాలం మారినప్పుడు, దేశ అవసరాలు మారినప్పుడు, తరువాతి తరం సంస్కరణలు కూడా అవసరమని మోదీ చెప్పారు.

సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కానుందన్నారు ప్రధాని మోదీ. కొత్త చరిత్ర మెుదలవుతుందన్నారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తు్న్నాయన్నారు. 'జీఎస్టీ తగ్గింపుతో పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు...