భారతదేశం, మార్చి 12 -- తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు.
రోడ్లు - భవనాల శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
జాతీయ రహదారులకు రింగు రోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ - విజయవాడ ఎక్స్ప్రెస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.