భారతదేశం, ఆగస్టు 11 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించి పేర్లు, సరిహద్దుల మార్పులపై ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) ఈ నెల 13న తొలిసారి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు.

గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు, కొన్ని జిల్లాలను ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఏర్పాటు చేశారని, దీనివల్ల ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దీంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల పేర్లపైనా వివాదాలు తలెత్తాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజ...