భారతదేశం, అక్టోబర్ 26 -- దేశీయ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ (Jio Platforms IPO) అలాట్‌మెంట్ ప్రక్రియ నేడు (అక్టోబర్ 26) పూర్తవుతోంది. మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో పబ్లిక్ ఇష్యూకు ప్రాథమిక మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభించింది. షేర్ల కేటాయింపును రిజిస్ట్రార్ కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) తో పాటు బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) అధికారిక పోర్టళ్ల ద్వారా ఇన్వెస్టర్లు సరిచూసుకోవచ్చు.

జియో ప్లాట్‌ఫార్మ్స్ పబ్లిక్ ఇష్యూ మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. యాంకర్ ఇన్వెస్టర్లతో కలిపి మొత్తం రూ.7.4 లక్షల కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. దాదాపు 1.39 కోట్ల దరఖాస్తులు రావడం భారతీయ ప్రాథమిక మార్కెట్ చరిత్రలోనే ఒక రికార్డు. యాంకర్ వాటా మినహాయించి పబ్లిక్ ఇష్యూ విలువ రూ.4.9 లక్షల కోట్లు దాటగా...