భారతదేశం, జూలై 8 -- తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జులై మెుదటివారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామమని అని చెప్పారు. అంతకుముందు ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌లో జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి.. రైతులతో కలిసి ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

6, 7, 8, 11 గేట్లను ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. దీంతో కృష్ణమ్మ జలసవ్వడి కనువిందు చేస్తోంది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశానని చెప్పారు. రాయలసీమ రతనాల సీమ కావాలని ప్రార్థించానని, మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందన్నారు. జలాల మన సంపద అని గుర్తు చేశారు. వాటితోనే రైతుల కష్టాలు తీ...