భారతదేశం, జనవరి 22 -- జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో పెను విషాదం నెలకొంది. సైనికులతో వెళ్తున్న ఒక ఆర్మీ వాహనం నియంత్రణ తప్పి లోయలో పడిపోవడంతో పది మంది జవాన్లు మరణించారు. భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఖన్నీ టాప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

మొత్తం 17 మంది సిబ్బందితో కూడిన బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్టు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఖన్నీ టాప్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం దాదాపు 200 అడుగుల లోతు ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోనే నలుగురు జవాన్లు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు కన్నుమూశారు.

గవర్నర్ దిగ్భ్రాంతి: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం ఈ దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట...