భారతదేశం, ఆగస్టు 27 -- జమ్మూలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. కత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి కనీసం 30 మందికిపైగా మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్ అంతటా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి, విద్యుత్ స్తంభాలు, మొబైల్ టవర్లు విరిగిపడ్డాయి. టెలికాం సేవలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది మధ్య కమ్యూనికేషన్ నిలిచిపోయింది.

'జమ్మూ కశ్మీర్‌లోని కత్రాలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.' అని ఎస్‌ఎస్‌పీ రియాసి పరమ్‌వీర్ సింగ్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జమ...