భారతదేశం, ఆగస్టు 8 -- 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన చాలా విజయవంతంగా అమలు అయింది. ఈ పథకం కింద 56 కోట్లకు పైగా వినియోగదారులు బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఈ పథకం ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున, తిరిగి కేవైసీ చేయడం తప్పనిసరి అయింది. గడువు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు.

బుధవారం ముగిసిన ద్రవ్య విధాన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా ఉంచింది. అంతేకాదు అనేక ముఖ్యమైన ప్రకటనలు చేసింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కస్టమర్ ఖాతా రీ-కేవైసీ చేయాలని పేర్కొంది. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. బ్యాంకులు కస్టమర్ల రీ-కేవైసీపై శిబిరాలను ప్రారంభించాయని అన్నారు.

2014లో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద దాదాపు 56 కో...