భారతదేశం, నవంబర్ 16 -- జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆగి ఉన్న ఇసుక లారీని తెలంగాణ ఆర్టీసీ రాజధాని బస్సు (టీజీ 03Z 0046) వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

ఈ ఘటనలో హైదరాబాద్‌ కు చెందిన పులంపరి ఓం ప్రకాష్ (75), హనుమకొండలోని బాలసముద్రంకు చెందిన నవజీత్ సింగ్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెంటనే చేరుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు . ...