భారతదేశం, అక్టోబర్ 30 -- జనగామ జిల్లా నిరుద్యోగులకు కలెక్టర్ కార్యాలయం తీపి కబురు అందించింది. జిల్లా సంక్షేమ అధికారి (WCD & SC) పరిధిలోని సఖి వన్ స్టాప్ సెంటర్, మిషన్ వాత్సల్య - జిల్లా శిశు పరిరక్షణ విభాగం (DCPU), చైల్డ్ హెల్ప్ లైన్ (1098) లలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఒప్పంద నియామకాలకు ప్రకటన జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 13 ఖాళీలను వివిధ విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు.

సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (సఖి) - 01 పోస్టు: లా (Law), సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్ లేదా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

సైకో సోషల్ కౌన్సెలర్ (సఖి) - 01 : సైకాలజీ, సైకియాట్రీ లేదా న్యూరోసైన్సెస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండి ఆరోగ్య రంగంలో అనుభవం ఉండాలి.

పారా మెడికల్ సిబ్బంది...