భారతదేశం, ఏప్రిల్ 3 -- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనుకున్నంత తేలిక కాదు. ముఖ్యంగా శాకాహారులకు (Vegetarians) ఇది మరింత పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఎలాంటి కృత్రిమ సప్లిమెంట్లు వాడకుండా రోజూ శరీరానికి కావలసినంత ప్రోటీన్ పొందడం కోసం వెజిటేరియన్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ సెలబ్రిటీ చెఫ్, మాస్టర్ చెఫ్ ఇండియా జడ్జ్ కునాల్ కపూర్. శాకాహారుల కోసం ఆయన తన ప్రత్యేకమైన 'హై ప్రోటీన్ వెజ్ ర్యాప్ విత్ కార్న్ సల్సా' రెసిపీని మార్చి 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

"చాలా మంది నన్ను వెజిటేరియన్ ప్రోటీన్ రెసిపీల గురించి అడుగుతుంటారు. ఎందుకంటే శాకాహారంలో మంచి ప్రోటీన్ వనరులను కనుగొనడం కొంచెం కష్టమైన పని. అయితే మీరేం ఆందోళన పడకండి. నేను మీకోసం ఒక అద్భుతమైన రెసిపీని తీసుకొచ్చాను. ఈ ర్యాప్ మీ శరీరానికి అవసరమై...