భారతదేశం, ఆగస్టు 27 -- ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘరోమైన రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను తీవ్రంగా ఢీకొట్టడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. చిలకలూరిపేట పరిసర ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ టర్న్ తీసుకోవడం వల్ల, వెనుక నుంచి వేగంగా వస్తున్న బస్సు అదుపు చేయలేక ఆటోను బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, స...