భారతదేశం, ఆగస్టు 23 -- మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యునిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు అభివృద్ధి చెందాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీచింగ్ హాస్పిటళ్లతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉందని మంత్రి పేర్కొన్నారు. టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే.. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో 1616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేశామని మంత్రి గుర్తు చేశారు. డాక్టర్లు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు, వైద్య సేవలు, మౌలిక వసతులు, మానవ ...