భారతదేశం, అక్టోబర్ 25 -- జ్యోతిష్య శాస్త్రంలో ప్రేమ, ఐశ్వర్యం, కీర్తి, కళలకు కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటే నిలిచిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. ప్రస్తుతం శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తూ.. తన నక్షత్ర గమనాన్ని మార్చుకున్నాడు.

హిందూ పంచాంగం ప్రకారం.. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3:11 గంటలకు శుక్రుడు కుజ గ్రహానికి చెందిన చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శుక్రుడి సంచారం డిసెంబర్ 5వ తేదీ ఉదయం వరకు, అంటే దాదాపు 42 రోజుల పాటు కొనసాగనుంది.

ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నక్షత్ర మార్పు వల్ల 4 రాశుల వారికి అపారమైన ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.....