భారతదేశం, ఏప్రిల్ 2 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక విధాలుగా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు చాలా పెద్ద సంయోగం ఏర్పడింది. హనుమాన్ జయంతి వేళ ఇలా మూడు గ్రహాల సంయోగం ఏర్పడడం చాలా విశేషమైనది, అరుదైనది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హనుమాన్ జయంతిని ఈ అరుదైన యోగం ఏర్పడింది.

ఏప్రిల్ 2, అనగా ఈరోజు, కుజుడు మీన రాశిలోకి మధ్యాహ్నం 3:30కి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీనరాశిలో శని, సూర్యుడు ఉన్నారు. ఇప్పుడు కుజుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశించడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం ఈరోజు హనుమాన్ జయంతి నుంచి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.

అప్పుడు ఈ మూడు గ్రహాల సంయోగం తొలగిపోతుంది. అయితే ఈరోజు త్రిగ్రాహి యోగం ఏర...