భారతదేశం, ఆగస్టు 26 -- ట్రంప్ అదనపు సుంకాల ప్రభావం మంగళవారం స్టాక్ మార్కెట్‌లో కనిపించింది. దీంతో చవితి ముందు అంటే ఆగస్టు 26న సెన్సెక్స్-నిఫ్టీ ప్రారంభమైన వెంటనే బాగా పడిపోయాయి. ట్రంప్ గతంలో భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. రష్యన్ చమురు కొనుగోలును చూపిస్తూ.. అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుండి అమల్లోకి వస్తుంది. మెుత్తం సుంకం 50 శాతంగా ఉంటుంది.

మరికొన్ని గంటల్లో ట్రంప్ టారిఫ్ అమల్లోకి రానున్న కారణంగా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 849.37 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 80,786.54 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ 24,712.05కి చేరుకుంది. 255.70 పాయింట్లకుపైగా కోల్పోయింది. దీనివల్ల పెట్టుబడిదారులు చాలా నష్టపోయారు.

మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ...