భారతదేశం, ఆగస్టు 6 -- పశ్చిమాసియాలో ఐదు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఒమన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు సానుకూలంగా సాగుతుండటంతో త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరి, హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్యం తిరిగి ప్రారంభమవుతుందనే వార్తలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి.

లండన్ ఐసీఈ ఎక్స్ఛేంజ్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 37 సెంట్లు (0.5 శాతం) తగ్గి బ్యారెల్‌కు 79.08 డాలర్లకు చేరింది. అలాగే అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 53 సెంట్లు (0.7 శాతం) క్షీణించి బ్యారెల్‌కు 74.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, దౌత్య చర్చల్లో భాగంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ పర్యవేక్షణకు వీలు కల్పించేలా ఒక...