భారతదేశం, నవంబర్ 3 -- గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి శీతాకాలం ఉదయం వేళల్లో నడక కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సాధారణ రోజుల్లో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా వాకింగ్ చేయడం హృదయ ఆరోగ్యానికి ఎంతో మంచిదే. అయితే చలిగాలులు, పొగమంచు వాతావరణం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల గుండెపై అదనపు భారం పడుతుంది. గుండె రక్తనాళాల సమస్యలు (Coronary Artery Disease), అధిక రక్తపోటు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటుకు గురైనవారు చలికాలంలో వ్యాయామాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు, ఎలా సురక్షితంగా నడవాలనే విషయంలో సరైన అవగాహన ఉండాలి. శీతాకాలంలో మార్నింగ్ వాక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోల్‌కతాలోని బీఎమ్ బిర్లా హార్ట్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ బి మాల్పానీ పలు కీలక సూచనలు చేశారు.

చలి తీవ్రత...