భారతదేశం, నవంబర్ 13 -- నవంబర్ నెల వచ్చిందంటే చాలు వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు మొదలవుతాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, గాలిలో తేమ తగ్గడం, గాలి ప్రసరణ మందగించడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. సాధారణంగా శీతాకాలం ప్రారంభంలో చల్లని గాలి భూమికి దగ్గరగా ఉండటంతో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ పైకి వెళ్లకుండా వాతావరణంలోనే చిక్కుకుపోతుంది.

ఉదయం వేళల్లో పొగమంచుతో పాటు కాలుష్య కారకాలు కలిసిపోవడం వల్ల చిన్నపిల్లల శ్వాసకోశ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. "వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కలయిక చిన్నారులకు ఎంతో సవాలుగా మారుతుంది. ఈ సమయంలో పిల్లల్లో నిరంతర దగ్గు, జలుబు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నారుల ఊపిరితిత్తులు, రోగనిరోధక వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉంటాయి. కా...