భారతదేశం, సెప్టెంబర్ 9 -- ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి రాకపోవడంతో సెప్టెంబర్ 11న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకే కట్టుబడి ఉన్నామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలను తక్షణమే అమలు చేయాలని లేదా నిలకడైన కాలపరిమితితో కూడిన హామీ ఇవ్వాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) డిమాండ్ చేసింది.

చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కార్యాలయంలో యూఎఫ్‌బీయూ ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్‌ఎస్) అధికారులతో ఆన్‌లైన్ వేదికగా చర్చలు జరిపారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో బ్రిక్స్ (BRICS) దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని పునరాలోచించాలని అధికారులు కోరారు.

అయితే ఐదు రోజుల పనిదినాలపై స్పష్టమైన హామీ లభించనందు...