భారతదేశం, సెప్టెంబర్ 1 -- పండుగల సీజన్‌ ప్రారంభమవుతున్న వేళ దేశంలో చక్కెర అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ వద్ద ఉంచుకోగలిగే చక్కెర నిల్వల పరిమితిని సగానికి తగ్గించింది.

ప్రస్తుతమున్న 4,000 క్వింటాళ్ల పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. సరుకు అందిన రోజు నుంచి 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదనే పాత నిబంధన కూడా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా చక్కెర మిల్లులు, హోల్‌సేల్ వ్యాపారుల వద్ద జరిపిన భౌతిక తనిఖీల్లో భారీగా అక్రమ నిల్వలు, లెక్కల్లో చూపని సరుకు, విక్రయాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. దీంతో ప్రభుత్వం ఈ ...