భారతదేశం, మార్చి 3 -- చంద్ర గ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేశారు. ఆలయ ద్వారాలు మూసిన అనంతరం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. క్యూలైన్ లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేనట్లు చెప్పారు.

ఆలయ మూసివేత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని చోట్ల పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలియజేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....