భారతదేశం, నవంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల కూల్చివేత వ్యవహారం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ జగన్.. ఈ ఘటన కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో జరిగిన పలు ఆలయాల కూల్చివేత ఉదంతాలను వైఎస్ జగన్ తన ప్రకటనలో గుర్తుచేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేసే ధోరణి కొనసాగుతోందని ఆయన విమర్శించారు.

"హే రామ్.. ఆలయాలను కాపాడండి,...