భారతదేశం, అక్టోబర్ 18 -- తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింపజేసింది.

చంద్రుని చల్లని వెన్నెల ప్రకృతికి ఆహ్లాదాన్ని, మనసుకు ప్రశాంతతను అందించినట్లే, చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీవారి దివ్యమంగళ రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. పరమశివుని శిరోభూషణంగా చంద్రుడు విరాజిల్లుతుండగా, శ్రీమహావిష్ణువు వాహనంగా చంద్రప్రభ వెలుగొందడం హరిహర తత్త్వ సమన్వయాన్ని స్ఫురింపజేసే విశిష్ట ఆధ్యాత్మిక విశేషం.

నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీవారి దర్శనం భగవంతుని దివ్యలీలలను స్మరింపజేసింది. చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుని లీలామాధుర్యం, శ్రీవారి దివ్...