భారతదేశం, ఫిబ్రవరి 9 -- బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సందర్భంగా ఫిబ్రవరి 8న ఆమె నివాసంలో సోనమ్ కపూర్ సీమంతం (గోద్ భరాయ్) వేడుక అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల మధ్య ఈ వేడుక సంప్రదాయబద్ధంగా, ఎంతో హుందాగా సాగింది.

సోనమ్ కపూర్ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లెమన్ గ్రీన్ కలర్ లెహంగా చోళీలో సోనమ్ కపూర్ 'ప్రెగ్నెన్సీ గ్లో'తో వెలిగిపోతూ కనిపించారు.

భారీ ఆభరణాలు, జడతో సోనమ్ కపూర్ ఒక గజలక్ష్మిలా మెరిసిపోయారు. పూజలో కూర్చున్న సమయంలో భార్య సోనమ్ నుంచి ఆనంద్ ఆహుజా కళ్లు తిప్పుకోలేకపోవడం అక్కడున్న వారిని మురిపించింది. ...