భారతదేశం, మే 4 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రాడెక్టు పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం( భవ్య పథకం) కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధి పై సీఎం చర్చించారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియ...