భారతదేశం, ఆగస్టు 8 -- పాకిస్తాన్: కుటుంబ కలహాల కారణంగా 28 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి మృతదేహం తాజాగా ఒక గ్లేసియర్‌లో లభ్యమైంది. సాధారణంగా ఇన్నేళ్లకు కేవలం అస్థిపంజరం మాత్రమే మిగలాలి. కానీ ఇక్కడ నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, మృతదేహం ఏ మాత్రం కుళ్లిపోకుండా, గడ్డకట్టుకుపోయి యథాతథంగా ఉంది.

1997లో నసీరుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబంతో గొడవల తర్వాత కోహిస్తాన్ ప్రాంతంలోని పర్వతాల వైపు వెళ్ళి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అతని కోసం గాలించినా ఫలితం దక్కలేదు.

28 ఏళ్ల తర్వాత, అటుగా వెళ్తున్న ఓ కాపరి ఒక గ్లేసియర్ దగ్గర చెక్కుచెదరని మృతదేహాన్ని చూసి షాకయ్యాడు. "నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. శరీరం అలాగే ఉంది. బట్టలు కూడా చిరిగిపోలేదు" అని అతడు చెప్పాడు.

పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. శరీరంపై దొరికిన గుర...