భారతదేశం, సెప్టెంబర్ 18 -- గ్రూప్ 1 పరీక్షలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్ష విధానంలో మార్పులను చేయాలనే ప్రతిపాదనలు తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లు కాకుండా ఒక పేపర్‌గానే నిర్వహించనున్నారు. అంతేకాదు తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టు రెండు పేపర్లను ఒక్క పేపర్‌గానే నిర్వహించాలని అనుకుంటోంది ఏపీపీఎస్సీ.

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమినరీకి రెండు పేపర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒక్కోటి 120 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ అప్టిట్యూడ్ ఉంటాయి. అయితే ఇవి వేర్వేర్వుగా నిర్వహించేబదులుగా ఒకే పేపర్‌గా నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదన చేసింది.

ఇప్పటి వరకు 120 మార్కులకు నిర్వహిస్తుండగా కొత్త ప్రతిపాదన ప్రకారం 150 మ...