భారతదేశం, ఫిబ్రవరి 5 -- గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించింది. అయితే సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె. పరుశరాములు, ఇతరులతో కలిసి మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషన్లను విచారించిన తర్వాత సింగిల్ జడ్జి బెంచ్ మార్చి 10న జారీ చేసిన తుది మార్కుల జాబితాను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసింది. అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి కొత్త ఫలితాలను ప్రకటించాలని కూడా టీజీపీఎస్సీని ఆదేశించింది. త...