Telangana,hyderabad, సెప్టెంబర్ 26 -- గ్రూప్ 1 నియామక పత్రాల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీన ఎంపికైన అభ్యర్థులకు అందజేయాలని నిర్ణయించింది. సాయంత్రం శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ర్యాంకర్లకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు.

మొత్తం గ్రూప్ 1 ఉద్యోగాలను 562 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తారు. ఇటీవలనే హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఉత్తర్వులు ఇవ్వటంతో. టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. వీరి ధ్రువపత్రాల కూడా పరిశీలించే ప్రక్రియను కూడా ఇవాళ్టితో పూర్తి చేయనుంది.

గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్ పడితే. గ్రూప్ 2, 3 ఉద్యోగాలపై ప్రభావం ...