భారతదేశం, డిసెంబర్ 16 -- అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల్లో ఆందోళన నెలకొంది. మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాలో నివసిస్తూ, స్థానిక సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న 60 ఏళ్ల బబ్లీ కౌర్ (Babblejit 'Bubbly' Kaur) ఉదంతం ఇప్పుడు అగ్రరాజ్యంలో కలకలం రేపుతోంది.

డిసెంబర్ 1వ తేదీన బబ్లీ కౌర్ తన గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు ఇచ్చేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కార్యాలయానికి వెళ్లారు. సాధారణంగా జరిగే ప్రక్రియే కదా అని వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆమె కుమార్తె జ్యోతి కౌర్ కథనం ప్రకారం.. "అమ్మ ఫ్రంట్ డెస్క్ వద్ద ఉండగా, కొందరు ఫెడరల్ ఏజెంట్లు లోపలికి వచ్చి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లారు. కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు" అని వివరించారు.

బబ్లీ కౌర్ ...