భారతదేశం, జనవరి 21 -- జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాని కోరారు. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర-పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు.

'విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవుల నేతృత్వంలోని పారిశ్రామిక నోడ్‌లు పునరుత్పాదక ఇంధన వనరులు, LNG/ లో- కార్బన్ అమ్మోనియా మౌలిక సదుపాయాలు, తయారీని సహ-స్థాపనకు అనుమతిస్తాయి. ఇక్కడ జెరా యాంకర్ ప...