భారతదేశం, ఆగస్టు 26 -- తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల ప్రక్రియ మెుదలైంది. ఈసీ తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా గురించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది. ఆగస్టు 29వ తేదీన జిల్లా స్థాయి, ఆగస్టు 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఈసీ తెలిపింది.

వెనుకబడిన తరగతులకు(బీసీలు) 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపినా లేదా అనే దానితో సంబంధం లేకుండా హైకోర్టు నిర్దేశించిన గడువు అయిన సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర...