Andhrapradesh, అక్టోబర్ 11 -- గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్రవేసింది. గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు సరికొత్త విధానాలకు రూపకల్పన చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన నిపుణులతో నాలుగు నెలలపాటు పలు దఫాల చర్చల అనంతరం.. పలు సంస్కరణలు తీసుకొచ్చేందుకు ముందడుగు వేశారు. ఈ విషయంలో సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపారు.

10 వేలు జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా ...