భారతదేశం, ఆగస్టు 12 -- రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఆర్థిక పురోగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2,08,406 కోట్ల విలువైన 25 భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

రాష్ట్రంలో పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను నేరుగా 'ఎస్క్రో ఖాతాల' (Escrow Accounts) లోకి జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే, ప్రాక్టికల్‌గా ఎంత మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వగలమో నిర్ణయించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల...