భారతదేశం, మార్చి 26 -- గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న కూట‌మి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ‌ స‌హాయ‌కుల‌కు ( VAO )ల‌కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాల‌న్న నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రెండున్నర ద‌శాబ్దాల‌ కింద‌టే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వెలుగు ప‌థ‌కం ద్వారా పేద‌ల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశార‌ని మంత్రి చెప్పారు.

డ్వాక్రా సంఘాల ప‌టిష్టత‌కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సెర్ప్ సంస్థ ఏర్పాటు చేశార‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. నాడు చంద్రబాబు మ‌దిలో వ‌చ్చిన ఈ ప‌థ‌కం ద్వారా గ్రామాల్లో 90 ల‌క్షల మంది మ‌హిళ‌లు 8.32 ల‌క్షల స్వయం స‌హాయ‌క సంఘాల్లో స‌భ్యులుగా స్వయంకృషితో ఎదుగుతున్నార‌ని మంత్రి తెలిపారు. ఈ స‌భ్యుల నుంచి ప్రతి గ్రామం...