భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, అలాగే వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెల్లడించారు.

రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ గడువులను నిర్ణయించింది. ఈ నెల 20న నోటిఫికేషన్/పబ్లిక్ నోటీసు జారీ కానుంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమై నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

నవంబరు 25న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు, సవరణలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటరు జాబితాను విడుదల చేస...