భారతదేశం, నవంబర్ 27 -- బంగారం ధరలు 15 నెలల కనిష్ఠ స్థాయి నుంచి వేగంగా పుంజుకుంటున్నాయి. బుధవారం 10 గ్రాములకు రూ.1,20,750 కనిష్ఠ స్థాయిని తాకిన ఎంసీఎక్స్ బంగారం రేటు, వరుసగా రెండు సెషన్లలో పెరిగింది. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల పసిడి ధర సుమారు రూ.1,25,800 వద్ద ఉంది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు రూ.6,000 మేర పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,600 డాలర్ల నిరోధక స్థాయిని దాటి, ఇంట్రాడేలో గరిష్ఠంగా 3,679 డాలర్లకు చేరింది.

దేశంలో 10 గ్రాముల బంగారం రికార్డు గరిష్ఠమైన రూ.1,80,779 కంటే ఇంకా రూ.55,000 తక్కువగానే ఉన్నా, భౌతిక రూపంలో బంగారం కొనడం సామాన్యులకు తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు. అందుకే చాలామందికి గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు మెరుగైన ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి. అయితే ధరలు కోలుకుంటున్న ఈ సమయంలో ఏ మార్గంల...