భారతదేశం, జూలై 19 -- హైదరాబాద్‌ నగరంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ జగదాంబ మహాకాళి గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమైంది. 2026 జూలై 19, జూలై 23, జూలై 26 తేదీలలో జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గోల్కొండ కోట పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

బోనాల ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు (జూలై 19, 23, 26 తేదీలలో) ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. గోల్కొండ కోటకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, కోటకు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. అందువల్ల వాహనదారులు, సాధారణ ప్రయాణికులు ఈ ...